ప్రకాశం: మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, మృత్యువుకు దారి వేసినట్లేనని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు . పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు బధవారం ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు మాసాల జైలు శిక్ష తప్పదన్నారు.