MBNR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో ఆమె బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.