ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 106 బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రొఫెసర్ (15), అసోసియేట్ (27), అసిస్టెంట్ ప్రొఫెసర్ (41) కాంట్రాక్ట్ పోస్టులతో పాటు 23 సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 24న ఉదయం 10 గంటలకు అసలు పత్రాలతో వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.