VKB: కొడంగల్ మండలంలో నాగారం – అన్నారం గ్రామాల మధ్య కల్వర్టు శిథిలవస్థకు చేరింది. అధిక లోడు వాహనాలు వెళ్లడంతో కల్వర్టు ఓ వైపు కూలిపోయింది. మరోవైపు సిమెంట్ పెచ్చులు తేలి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి నూతన కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.