నిజామాబాద్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపాలని.. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.