NZB: హైదరబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.