MNCL: బెల్లంపల్లి గ్రంథాలయం పని వేళలు కుదించవద్దని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం ధర్నా చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రంథాలయ చైర్మన్ లేకపోవడంతో ఇష్టారీతిన నిర్ణీత సమయాలు మారుస్తున్నారని వాపోయారు. మంచిర్యాలలో లాగా ఉదయం 7 నుంచి రాత్రి 9వరకు పనివేళలు కొనసాగించాలన్నారు.