KMM: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. కారుణ్య నియామకాలకు J.అసిస్టెంట్, ఓఎస్ ఖాళీల వివరాలను వారం రోజుల్లో అందించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.