TG: సింగరేణి కార్మికులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంస్థకు రూ.6394 కోట్ల లాభాలు వచ్చినా.. కేవలం రూ.2360 కోట్లలో 34% బోనస్ ఇవ్వడం అన్యాయమని అన్నారు. గతంలో BRS ప్రభుత్వం పూర్తి లాభాలపై 34% బోనస్ ఇచ్చిందని, ఇప్పుడు 50% కోత విధించి బోనస్ ఇవ్వడాన్ని ఖండించారు. కార్మికులకు పూర్తి లాభాలపై బోనస్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.