VZM: విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం కోకో టోర్నమెంట్లు నిర్వహించారు. ఇందులో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో సుమారుగా 20 టీములు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్లో సీనియర్ ఖోఖో గర్ల్స్ జిల్లా పరిషత్ పూల్ బాగ్ ప్రథమ స్థానంలోనూ, అలాగే సీనియర్, జూనియర్ బాయ్స్ ప్రథమ, ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.