W.G: పోషన్ మహా కార్యక్రమంలో భాగంగా సోమవారం తణుకు కొమ్మాయిచెరువు యూపీహెచ్సీ వద్ద పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార స్టాల్ ఏర్పాటు చేసి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు, ఈసీసీఈకు సంబంధించిన మెటీరియల్ ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పి.మహాలక్ష్మి పాల్గొన్నారు.