VZM: ఎస్కోటలోని గౌరీ నగర్ కాలనీకీ చెందిన టీడీపీ కార్యకర్త నాగభూషణం ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. ఈ సందర్బంగా టీడీపీ ప్రమాద బీమా తరఫున మంజూరైన రూ.5,00,000లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమన్నారు.