MNCL: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని కొలాంగూడ గ్రామంలో మండల ప్రభుత్వ ఉద్యోగులచే సేకరించిన దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చలి తీవ్రత దృష్ట్యా ప్రభావిత ప్రాంతాలలో ప్రజల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు.