MLG: కన్నాయిగూడెం మండలం గూరేవుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏళ్ల హరినాథ్ శనివారం సాయంత్రం ఆరుబయట ఆడుతుండగా పాము కాటు వేసింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.