BHGR: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.