నాగర్ కర్నూల్ డిపో నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ నెల 11న ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఈ యాత్రలో యాదగిరిగుట్టతో పాటు నాగిరెడ్డిపల్లి(బంగారు శివలింగం), స్వర్ణగిరి వెంకటేశ్వర క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ 94904 11590, 94904 11591నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.