నల్గొండ: గుండాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ పోస్టుకు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు. ఈ పోస్ట్ తాత్కాలిక పద్ధతిలో నియమించడం జరుగుతుందని, అభ్యర్థులు డిగ్రీ బీపీడీ చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వాసులై ఉండాలని ఈనెల 4 నుంచి 5వ వరకు దరఖాస్తు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.