NZB: డయల్ 100కు కాల్ చేసి సమయం వృథా చేసిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధిచినట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. భీమగల్ మండలం దేవక్కపేటకు చెందిన చిగురాల రాజు అక్టోబర్ 31న ధర్పల్లి మండలం హోన్నాజీపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి మద్యం మత్తులో డయల్ 100కు పలుమార్లు కాల్ చేసి సమయం దుర్వినియోగపరచడంతో రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.