సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆరెపల్లికి చెందిన గొర్ల అజయ్ ఇటీవల ప్రమాదవశాత్తు వ్యవసాయ పనులు చేస్తూ మృతి చెందాడు. మృతుడి కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన నమిలికొండ రాజు -లత దంపతులు వారి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.