ADB: తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామస్తులు MLA అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన క్యాంపు కార్యాలయం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న శ్రీ విఠల రుక్మిణి తృతీయ వార్షికోత్సవానికి కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులున్నారు.