కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 23వ డివిజన్ సీతారాంపూర్లో రూ.49.99 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు సోమవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి రాజకుమార్, నాయకులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.