ASF: జిల్లాకు విచ్చేసిన కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా పలు సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లారు. NH-63 రహదారి నిర్మాణ వేగవంతం చేయాలని, చెన్నూరు జోడు వాగు ప్రాంత రవాణా సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.