SRPT: స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలకు సంబంధించిన 146 గ్రామ పంచాయతీలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రెండు రోజులు నామినేషన్లు మందకొడిగా సాగాయి. ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 17న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి.