మెదక్ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మైనింగ్, ఇరిగేషన్, పంచాయతీ హౌసింగ్ అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేయాలని సూచించారు.