ADB: ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష తెలియజేశారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్మికులతో సమావేశమై ఆమె మాట్లాడారు. చెత్తను తొలగించే జవాన్లు, డ్రైవర్లు సమయానికి ముందే వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లిపోవడం పట్ల వారిపై చైర్ పర్సన్ బండారి అనూష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.