HYD: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఉప్పల్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ‘X’ వేదికగా HYD సీపీ సజ్జనార్ స్పందించారు. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మీ ప్రాణం చుట్టూ ఎన్నో బంధాలు, ఇంకెన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు అంటూ ట్వీట్ చేశారు.