MLG: మేడారం రైతులకు రెండో పంట నష్టపరిహారం రాకపోవడానికి గత,ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దారావత్ దేవా నాయక్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలోనూ రైతులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.