MHBD: తెలంగాణ రాష్ట్ర మహిళా త్రోబాల్ జట్టు జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ జాతీయ త్రోబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం (రన్నరప్) సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. డోర్నకల్ మండలం, ఉయ్యాలవాడకి చెందిన తల్లూరి హరిచందన జట్టులో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెపై ప్రశంసలు విలువెత్తుతున్నాయి.