GDWL: షాద్‌నగర్ నుంచి ఏపీలోని అనంతపూర్‌కు అక్రమంగా ఎద్దులు తరలిస్తున్న కంటైనర్‌ను ఇటిక్యాల పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా నేషనల్ హైవేపై వస్తున్న కంటైనర్‌ను ఆపి పరిశీలించగా అందులో 29 ఎద్దులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా ఎద్దులు తరలిస్తుండటంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.