NZB: పొతంగల్ మండలం తిర్మలాపూర్‌లో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ బోయి సైదవ్వ, ఉప సర్పంచ్ సంజీవ్, ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హనుమంతు, నాగయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గంగాధర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.