SRD: రాయికోడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నట్లు ఎస్సై చైతన్య కిరణ్ గురువారం తెలిపారు. ప్రజల మధ్య ఐక్యమత్యం సామాజిక సమగ్రతను పెంచేందుకు గాను రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాయికోడ్ క్రాస్ రోడ్డు నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.