పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి తండ్రి రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శనివారం రాత్రి వారి కుటుంబాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించి, రామస్వామి చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.