WGL: నర్సంపేటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనగణనతో పాటు కులగణన చేపట్టే చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పట్టణ బీజేపీ అధ్యక్షుడు గూడూరు సందీప్ నేతృత్వంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. జనగణన దేశ అభివృద్ధికి, కులగణన సామాజిక సమానతకు దోహదపడుతుందన్నారు. డేటా సేకరణ ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.