RR: సరూర్‌నగర్ మార్కెట్‌కు మిర్చి రాక భారీగా పెరిగింది. వారం రోజులుగా వేల బస్తాల ఎర్రబంగారం మార్కెట్‌కు చేరుతుంది. డిమాండ్ ఉన్నప్పటికీ స్థానికంగా వ్యాపారుల సిండికేట్‌తో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదని వాపోతున్నారు. రూ. 19వేలకు పైగా ఉన్న క్వింటాకు వ్యాపారులు కుమ్మక్కై రూ. 2వేల నుంచి రూ. 4వేల వరకు తగ్గించి ఇస్తున్నారని చెబుతున్నారు.