NLG: నల్లగొండ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీనికి తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రిపూట మాత్రమే కాకుండా పగలంతా చలిగానే ఉండడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.