ganjayi : వరుసగా నిషేధిత గంజాయి తెలంగాణలో పోలీసుల చేతికి పట్టుబడుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఏకంగా 11.5 టన్నుల గంజాయిని పోలీసులు కాల్చి దహనం చేశారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇలా గంజాయి పట్టుబడే ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాల నుంచి భారీగా తరలి వెళుతున్న గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు తరచుగా పట్టబడుతోంది.
ఇలా పట్టుబడిన గంజాయిని పెద్ద మొత్తంలో ఒక్కసారిగా పోలీసులు దహనం చేశారు. రెండు నెలల క్రితం కూడా ఇలాగే టన్నుల కొద్దీ గంజాయిని దగ్ధం చేశారు. అయినా మళ్లీ అదే స్థాయిలో గంజాయి పట్టుబడటంతో గురువారం దాన్ని మరోసారి దహనం చేశారు. భద్రాచలం, ఖమ్మం జిల్లాల మీదుగా పెద్ద ఎత్తున గంజాయి (Cannabis)హైదరాబాద్ వైపు తరలిపోతున్నట్లు తెలుస్తోంది.
డిస్ట్రిక్ట్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్… జిల్లా వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిని ముందుగా స్టేషన్ల వారీగా తూకం వేశారు. ఏఏ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఎంత పట్టుబడిందన్న వివరాల్ని నమోదు చేసుకున్నారు. తర్వాత దాన్ని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేయించారు. దీని విలువ ఏకంగా రూ.28 వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.