Rain Effect: తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం (Rain) కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తోన్న నీటితో వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల చెరువు కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి వరదనీరు వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో (warangal) పరిస్థితి దారుణంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సిచుయేషన్ ఇంచు మించు అలానే ఉంది. సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్కు ఎన్డీఆర్ఎఫ్ (ndrf) కూడా తోడయ్యింది. ఫైర్ సేప్టీ అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ ప్రియాంక అల (priyanka ala) పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు పలు గ్రామాల్లో 27 కాలనీల్లో ఉన్న జనాలను తరలించామని తెలిపారు. మొత్తం 790 కుటుంబాలను (790 families) తరలించామని పేర్కొన్నారు. 2321 మందిని కాపాడామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గత రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
#WATCH | As Telangana continues to receive incessant rainfall, the water level of Godavari in Bhadrachalam has been rising.
Bhadradri Kothagudem District Collector Priyanka Ala says, "…About 27 colonies & villages have been evacuated. A total of 790 families, consisting of… pic.twitter.com/5oyObUwN8s
భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి (ayyappa) గుడిలోకి వరద పోటెత్తింది. హన్మకొండ- వరంగల్ రోడ్ (warangal road) వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నిలిచిపోయింది. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బందమైంది. వరంగల్లో గల కాజీపేట రైల్వేస్టేషన్లోకి భారీగా వరదనీరు చేరుకుంది. మోకాళ్ల లోతులో నీళ్లు ఉన్నాయి. మైలారం వద్ద భారీ వృక్షం కూలింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.