MDK: చేగుంట మండలం పోలంపల్లికి చెందిన కొండి లక్ష్మీ కుటుంబానికి భూమి కేటాయించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి స్వామి డిమాండ్ చేశారు. తహసీల్దార్ శివప్రసాద్కు కొండి లక్ష్మీ భర్త అంజయ్యతో కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో లక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల హామీ మేరకు భూమి కేటాయించాలన్నారు.