MDCL: దుండిగల్ జరిగిన స్వాతి(21) హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటి యజమాని కిషన్‌తో ఆమె పెట్టుకున్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కిషన్ అల్లుడైన రాజేష్, శనివారం స్వాతి కొడుకు కళ్ల ముందే ఆమెను గొంతు కోసి హతమార్చాడు. కుటుంబ గొడవల నేపథ్యంలో కిషనే తనతో హత్య చేయించినట్టు రాజేష్ పోలీసులకు తెలిపాడు.