WGL: పర్వతగిరి మండలం ఇస్లావత్ తండాలో విద్యుత్ సిబ్బంది మొక్కజొన్న చేనును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ రైతు మంగ్యా నాయక్ ఇవాళ గ్రామంలోని సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. ట్రాన్స్ఫార్మర్ మార్చే క్రమంలో సమాచారం ఇవ్వకుండా చేనులోంచి ఇష్టారాజ్యంగా వెళ్లడంతో పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.