ఎంతోమంది రోగులకు ఉచితంగా రక్తాన్ని అందిస్తోన్న ‘చిరంజీవి (Chiranjeevi) ఛారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటై నేటికి 25 ఏళ్లు పూర్తవుతుందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ట్రస్టు ద్వారా 10 లక్షల యూనిట్లకు పైగా బ్లడ్(Blood)న్ని నిరుపేదలకు పంపిణీ చేశాం. 10వేల మందికి కంటిచూపు పునరుద్ధరించాం. ఇలా సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తి అసమానమైనది. ఇందులో భాగమైన లక్షలాది మందికి నా సెల్యూట్. ఇది. మహాత్ముడికి గొప్ప నివాళి’ అని పేర్కొన్నారు. తోటి మానవాళికి సాయం చేయడం వల్ల పొందిన సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. సీసీటీ (CCT) వేదికగా మానవతా కార్యక్రమాల్లో భాగమై తమ వంతు సాయం చేస్తున్న వారందరికీ సెల్యూట్ చేస్తున్నా.కరోనా సమయంలో వేల మందికి సాయం అందించాం. తోటి మానవాళికి సాయం చేయడం వల్ల పొందిన సంతృప్తిని మాటల్లో వర్ణించలేం.
సీసీటీ వేదికగా మానవతా కార్యక్రమాల్లో భాగమై తమ వంతు సాయం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయం ఇది’’ అంటూ చిరు పెర్కోన్నారు. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయం ఇది’’ అంటూ చిరు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.సాధారణ నటుడి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన క్రమంలో తోటివారికి తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో చిరంజీవి.. సీసీటీని ప్రారంభించారు. 1998 అక్టోబర్ 2 నుంచి ఇది మొదలైంది. సీసీటీలో భాగంగా బ్లడ్ బ్యాంకు
(Blood Bank)లను మొదలుపెట్టారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల (Oxygen cylinders) ను సైతం సరఫరా చేశారు. సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి.