RR: తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో గజం స్థలం రూ. 3.40 లక్షలు పలికిందని ఆ సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ కె.శశాంక తెలిపారు. 2017లో అదే ప్రాంతంలో రూ. 88 వేలు ఉన్న ధర.. ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగిందన్నారు.