కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన కుర్మ రాకేష్ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. ఆ సమయంలో ఎండ తాకిడికి చెరువులో ఈతకు దిగారు. దింతో గుంతలో పడి మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు.