ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి తెలిపారు. 2020-25 మధ్య డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 14,000 నుంచి రూ. 18,000 వేతనం, అదనపు అలవెన్సులు ఉంటాయన్నారు.