WNP: అమరచింతలో బుధవారం కాలువ దాటుతూ ప్రమాదవశాత్తు కిందపడి చిన్నిరెడ్డి అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు 108 వాహనంలో అతడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాలని ఆత్మకూరు వైద్యులు సూచించారు.