MBNR: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజాభివృద్ధి కోసమేనని మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలు పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు.