KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు.