VKB: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కొడంగల్ పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. రాత్రి 9:58 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి చేసిన తర్వాత సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని ఆలయ ధర్మకర్తలు నందారం తెలిపారు.