JGL: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ల ఆధ్వర్యంలో “వీర హనుమాన్” విజయ యాత్రను కోరుట్ల పట్టణంలో శనివారం వైభవంగా నిర్వహించారు. హనుమాన్ విజయ యాత్ర స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం నుంచి మొదలై గాంధీ రోడ్డు, కార్గీల్ చౌక్ మీదుగా కొత్త బస్టాండ్, అంబేడ్కర్ నగర్, జవహర్ రోడ్ నుండి తిరిగి వెంకటేశ్వర ఆలయానికి చేరుకుంది.