BDK: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు లేఖ రాశారు. భద్రాచలం పట్టణ అభివృద్ధికి, పాలనా సౌలభ్యానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎట్పాక, కన్నాయిగూడెం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన విలీన బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.